మరోసారి చిరు సినిమాలో చరణ్..?

Published on Feb 9, 2023 7:06 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చిరు కి చెల్లెలి పాత్రలో నటిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భోళా శంకర్” లో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు మెహర్ రమేష్ అయితే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా తమిళ హిట్ చిత్రం వేదాళం కి రీమేక్ గా తెరకెక్కుతుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉండగా నిన్ననే మేకర్స్ ఓ సాలిడ్ సాంగ్ షూట్ కూడా స్టార్ట్ చేశారు.

అయితే ఈ సాంగ్ న్యూస్ తోనే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా భోళా శంకర్ సెట్స్ నుంచి ఉన్నట్టుగా కొన్ని ఫోటోలు బయటకొచ్చి వైరల్ గా మారాయి. అయితే దీనితో మరోసారి మెగాస్టార్ సినిమాలో చరణ్ కనిపించనున్నాడు అని ఈ సాంగ్ లో కనిపిస్తాడని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఎలాగో సెట్స్ నుంచే ఫోటో బయటకి వచ్చింది కాబట్టి చాలా మంది చరణ్ కామియో అయితే ఫిక్స్ అయ్యిపోయారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియల్సి ఉంది. ఇక ఈ సినిమాకి మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే

సంబంధిత సమాచారం :