ఓటిటి: రెండో వారం కూడా ట్రెండ్ అవుతోన్న “చారి 111”

ఓటిటి: రెండో వారం కూడా ట్రెండ్ అవుతోన్న “చారి 111”

Published on Apr 16, 2024 9:00 PM IST

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ చారి 111. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. మురళి శర్మ, సంయుక్త విశ్వనాథన్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సిమోన్ కే. కింగ్ సంగీతం అందించారు. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో లోకి అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటి వరకూ 60 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ ను నమోదు చేసుకుంది. ఇది మంచి రెస్పాన్స్ అని చెప్పాలి.

ఈ చిత్రం రెండో వారం లో కూడా టాప్ 10 లో ట్రెండ్ అవుతోంది. అదితి సోనీ ఈ చిత్రం ను నిర్మించడం జరిగింది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా డీసెంట్ రెస్పాన్స్ ను కనబరుస్తూ, ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు