చైతు, సమంత చేతుల మీదుగా ‘మళ్లీ రావా’ ట్రైలర్ విడుదల !
Published on Nov 29, 2017 2:31 pm IST

సుమంత్‌ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మళ్ళీ రావా’. ఆకాంక్షా సింగ్‌ కథానాయికగా నటించిన ఈ సినిమాను స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్క నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టిజర్ కు మంచి స్పందన లభించింది. డిసెంబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇకపోతే ‘మళ్ళీ రావా’ సినిమా ట్రైలర్ ను సమంత & నాగ చైతన్య రేపు విడుదల చెయ్యబోతున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరిగా తెరకెక్కనున్న ఈ సినిమా సుమంత్ కు కమ్ బ్యాక్ ఫిలిం అవుతుందేమో చూడాలి. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ఈ వారంలోనే సెన్సార్ పూర్తి చేసుకోనుంది.

 
Like us on Facebook