సురేందర్ రెడ్డి అద్భుతమైన స్క్రీన్ ప్లే రాశారు – చిరంజీవి
Published on May 21, 2017 10:51 am IST


మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాని తోలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ ప్రాజెక్టును ఆగష్టులో మొదలుపెట్టే యోచనలో ఉన్నారు మెగాస్టార్. తాజాగా ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడిన ఆయన ‘చిత్రానికి పరుచూరి బ్రదర్స్ కథ అందించారు. జరిగిన చరిత్రను సినిమాగా తీయడమంటే మాటలుకాదు. దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా రీసెర్చ్ చేసి మంచి స్క్రీన్ ప్లే రాశారు’ అన్నారు.

అలాగే ఈ చిత్రానికి భారతదేశ స్థాయిలో మార్కెట్ చేసే సత్తా ఉందని, ఈ చిత్రంలో హీరోయిన్ గా కొందరి పేర్లు అనుకున్నామని, కానీ ఇంకా ఎవర్నీ ఖరారు చేయలేదని, ఈ ప్రాజెక్ట్ కోసం జాతీయ స్థాయి నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ఎంచుకుంటున్నామని అన్నారు. ఇకపోతే రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవివర్మ ఛాయాగ్రహణం, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తుండగా సాయిమాధవ్ బుర్రా, వేమారెడ్డి డైలాగ్స్ అందిస్తున్నారు.

 
Like us on Facebook