చిరంజీవి అల్లుడి సినిమా షూటింగ్ ప్రారంభం !

చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ వెండితెర ఆరంగేట్ర చిత్రం కొన్ని రోజుల క్రితం ప్రారంభమయ్యింది. వారాహి చలనచిత్రం బ్యానర్లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. లవ్ స్టోరి గా తెరకెక్కబోతున్న ఈ సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథాంశంగా రూపొందనుంది. కె.కె.సెంథిల్‌కుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందిస్తుండగా తనికెళ్ళభరణి, మురళీశర్మ, నాజర్, సత్యం రాజేష్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్ర టైటిల్ ను త్వరలో ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు.