మెగాస్టార్ చిరంజీవి అల్లుడి సినిమా మొదలైంది !

31st, January 2018 - 08:45:31 AM

ఎన్నాళ్లగానో చెప్పుకుంటున్న మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ తెరంగేట్రానికి ఈరోజు ముహూర్తం కుదిరింది. ఈ చిత్రాన్ని నిర్మించనున్న వారాహి చలన చిత్రం కార్యాలయంలో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. రాకేష్ శశి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో కళ్యాణ్ కు జోడీగా మాళవికా నాయర్ నటించనుంది. పూజా కార్యక్రమానికి ముఖ్య ఆతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు.

అలాగే ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మొదటి సన్నివేశానికి గురవ దర్శకత్వం వహించగా, సంగీత దర్శకుడు కీరవాణి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ‘బాహుబలి’ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా భాద్యతలు నిర్వహిస్తుండటం విశేషం. చిరంజీవిగారి అల్లుడు ఆరంగేట్రం చేస్తున్న ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తామని నిర్మాత సాయి కొర్రపాటి అన్నారు.

యోగేష్ సంగీత దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ త్వరలోనే ఆరంభంకానుంది. నాజర్, మురళి శర్మ, పోసాని, రాజీవ్ కనకాల, తణికెళ్లభరణి వంటి సీనియర్ నటులు ఇందులో నటించనున్నారు.