మెగాస్టార్ – పవర్ స్టార్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా!
Published on Feb 2, 2017 5:40 pm IST


మెగాస్టార్ చిరంజీవి తెలుగులో తిరుగులేని స్టార్ అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తొమ్మిదేళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నా, రీ ఎంట్రీతో అదిరిపోయే హిట్ కొట్టేశారాయన. ఇక ఆయన సోదరుడిగా తెరంగేట్రం చేసి చిరంజీవికి ఏమాత్రం తగ్గని స్టార్‌డమ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గురించీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే అధ్బుతంగా ఉంది కదూ? ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే చిరు, పవన్‌ల కాంబినేషన్‌లో ఓ మెగా మల్టీస్టారర్‌ రూపు దిద్దుకోనుంది.

ప్రముఖ వ్యాపారవేత్త, ఎంపీ, సినీ నిర్మాత అయిన టి. సుబ్బరామి రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. తెలుగులో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా పేరున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని సుబ్బరామి రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియల్సి ఉంది. అన్నీ కుదిరి మెగాస్టార్, పవర్ స్టార్ సినిమా నిజంగానే వస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయం అని చెప్పొచ్చు.

 
Like us on Facebook