ప్రభాస్ తో గొడవలపై ఫన్నీగా స్పందించిన దర్శకుడు !
Published on Mar 15, 2018 8:41 am IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షెడ్యూల్ దుబాయ్ లో జరుగుతోంది. 2 నెలల పాటు జరగబోయే ఈ షెడ్యూల్లో హెవీ యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగాషూటింగ్ సమయంలో ప్రభాస్ కు సుజీత్ కు మధ్యన మనస్పర్థలు తలెత్తాయంటూ కొన్ని రోజులుగా వార్తలు హడావుడి చేస్తున్నాయి.

ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఒక అభిమాని సుజీత్ ను అడగ్గా సుజీత్ స్పందిస్తూ ‘అంతా బాగానే జరుగుతోంది. చాలా వేగంగా పనులు చేస్తున్నాం. మధ్యలో ఇలాంటి వార్తలు మాకు ఎంటర్టైన్మెంట్ లాంటివి’ అంటూ సరదాగా సమాధానమిచ్చారు. దీంతో అందరికీ ఈ రూమార్లపై ఒక క్లారిటీ వచ్చినట్లైంది. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో శ్రద్దా కపూర్ తో పాటు ఇంకొంతమంది బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు.

 
Like us on Facebook