మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేసిన మల్టీ స్పోర్ట్స్ డ్రామానే పెద్ది. ఈ ఏడాది టాలీవుడ్ డ్రై గా ఉన్న సమయంలో వచ్చి ఈ సినిమా బిగ్ స్క్రీన్ మార్కెట్ కి మళ్లీ ఊపిరి పోసింది. అయితే ఈ సినిమా తర్వాత ఓటీటీ లోకి కూడా వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇటీవలే టెలివిజన్ స్ట్రీమింగ్ కి కూడా రానున్నట్లు ఖరారు అయ్యింది.
ఈ సినిమా శాటిలైట్ హక్కులు జీ తెలుగు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరు డేట్, సమయం ఖరారు చేసారు. ఈ అక్టోబర్ 11న సాయంత్రం ఐదున్నర గంటలకి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సినిమా టెలికాస్ట్ కానున్నట్లు తెలిపారు. మరి ఈ సినిమాతో మెగాపవర్ స్టార్ అక్కడ కూడా సిక్సర్ రెస్పాన్స్ కొడతాడో లేదో వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. వృద్ది సినిమాస్ నిర్మాణం వహించారు.


