బాలీవుడ్ సినిమా మళ్లీ పుంజుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిన్న సినిమా హనుమాన్ అంశ ఒక పెను సంచలనం సెట్ చేస్తే ఈ సినిమా హవా కొనసాగుగుండగానే అవైటెడ్ సీక్వెల్ సినిమా దృశ్యం 3 అజయ్ దేవగన్ నుంచి వచ్చింది. అయితే ఈ సినిమాపై ఉన్న మన వైపు అంత కనిపించలేదు కానీ నార్త్ బెల్ట్ లో మాత్రం ఊపిస్తుంది. రికార్డ్ బుకింగ్స్ వసూళ్లతో దృశ్యం3 ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషనల్ వసూళ్లు అందుకున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకి ఏకంగా 100 కోట్లకి పైగానే ఓపెనింగ్స్ దక్కినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇండియా వైడ్ గా అయితే బాలీవుడ్ లో ఈ ఏడాదికి ధురందర్ 2 తర్వాత ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్ అన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనితో దృశ్యం 3 బాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించగా టబు, శ్రీయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.


