‘సిగ్మా’ నుంచి కూడా ఆ హీరో లక్కీ ఎస్కేప్!?

‘సిగ్మా’ నుంచి కూడా ఆ హీరో లక్కీ ఎస్కేప్!?

Published on Oct 3, 2026 10:01 AM IST

లేటెస్ట్ గా థియేటర్స్ లో విడుదలకి వచ్చిన సినిమాల్లో ఒకటే సిగ్మా. యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా దర్శకుడు జాసన్ సంజయ్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ రెండు భాషల్లో విడుదల అయ్యింది. కానీ ఈ సినిమాకి మాత్రం ఊహించని విధంగా డిజప్పాయింట్ రెస్పాన్స్ నే వచ్చింది. అయితే ఈ సినిమా విషయంలో ఓ ప్రముఖ హీరో లక్కీ ఎస్కేప్ అయ్యాడని చెప్పాలి.

నిజానికి ఈ సినిమాని జాసన్ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తో చేయాలి అనుకున్నాడు. కానీ దుల్కర్ ఎస్కేప్ అవ్వడంతో సందీప్ వద్దకి వచ్చింది. సో లక్కీ భాస్కర్ కి మాత్రం ఇది లక్కీ ఎస్కేప్ అనే అనుకోవాలి. అయితే దుల్కర్ కి ఇది మొదటిసారి ఏమీ కాదు. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా డిజప్పాయింటింగ్ సినిమాల నుంచి బాగానే తప్పించుకున్నాడు కానీ తను మాత్రం ఐమ్ గేమ్ తో దొరికిపోయాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు