కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన అవైటెడ్ సెన్సేషనల్ సీక్వెల్ సినిమానే జైలర్ 2. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ భారీ మల్టీస్టారర్ కోసం ఫ్యాన్స్, మూవీ లవర్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా దగ్గరకి వస్తున్న సమయంలో తలైవర్ తన ర్యాంపేజ్ స్టార్ట్ చేశారు.
యూఎస్ మార్కెట్ లో ఆల్రెడీ లక్ష డాలర్లు మార్క్ ని దాటేసిన ఈ సినిమా అక్కడ తమిళ్ సినిమా నుంచి ఫాస్టెస్ట్ 150కే (లక్ష 50 వేల డాలర్లు) మార్క్ అందుకున్న సినిమాగా కూడా నిలిచింది. ఇలా మొత్తానికి తలైవర్ ఆట ఆరంభం అయింది అని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమాకి అనిరుద్ క్రేజీ మ్యూజిక్ అందించగా ఈ అక్టోబర్ 15న పాన్ ఇండియా భాషల్లో సినిమా విడుదల కానుంది. అలాగే సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మాణం వహించగా విద్యా బాలన్, ఎస్ జే సూర్య తదితరులు నటించారు.


