బాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సీక్వెల్ సినిమానే దృశ్యం 3. అజయ్ దేవగన్ హీరోగా టబు, శ్రీయ శరన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఎట్టకేలకు థియేటర్స్ లో విడుదల అయ్యి మలయాళ వెర్షన్ కి పూర్తి భిన్నంగా సంచలన రెస్పాన్స్ అందుకుంది. డే 1, ప్రీ బుకింగ్స్ లో ఊహించని రెస్పాన్స్ నమోదు చేసి ఈ సినిమా ఇప్పుడు భారీ వసూళ్లపై కన్నేసింది.
పాన్ ఇండియా సినిమాలు చేసే మ్యాజిక్ ని ఈ సినిమా కేవలం సింగిల్ భాషలో చేస్తూ ట్రేడ్ సర్కిల్స్ ని విస్మయానికి లోను చేస్తుంది. రిలీజ్ రోజు బుకింగ్స్ ఒక్క బుక్ మై షో లోనే ఏకంగా 1 మిలియన్ టికెట్స్ కి పైగా సేల్ అయ్యాయి. ఇది మాత్రం ఒక ఊహించని రెస్పాన్స్ అని చెప్పాలి. అంతకు ముందు 8 లక్షలకి పైగా సేల్స్..
ఇలా మొదటి రోజుకే సుమారు 2 మిలియన్ టికెట్ సేల్స్ ఈ సినిమాకి జరగడం అనేది దీని క్రేజ్ ఎలా ఉందో చెప్తుంది. ఇప్పుడు టాక్ కూడా పాజిటివ్ పడింది. ఇక వీకెండ్ బుకింగ్స్, వసూళ్లు మాత్రం ఊహాతీతంగా ఉంటాయని చెప్పవచ్చు. అలానే హిందీలో భారీ లాంగ్ రన్ కూడా ఈ సినిమాకి దక్కే ఛాన్స్ ఉంది.


