పవన్ “హరిహర వీరమల్లు” రూమర్స్ పై క్లారిటీ..!

పవన్ “హరిహర వీరమల్లు” రూమర్స్ పై క్లారిటీ..!

Published on Dec 5, 2021 8:01 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. భారీ యాక్షన్ సహా నెక్స్ట్ లెవెల్ విజువల్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఓ ఉహించని రూమర్ బయటకి వచ్చినట్టుగా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

మరి ఇప్పుడు నిధి నే ఈ సినిమా నుంచి తప్పుకుంది అని గాసిప్స్ వైరల్ అవుతున్నాయట. మరి దీనిలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఇవ్వన్నీ జస్ట్ రూమర్స్ అట. నిధి ఈ సినిమాలో కొనసాగుతుంది అని తాజా కన్ఫర్మేషన్. ఇక ఈ భారీ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే మెగా సూర్య ప్రొడక్షన్ వారు అత్యధిక వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు