సౌత్ ఇండియా స్టార్ హీరో మీద పోలీసు పిర్యాదులు !
Published on Oct 23, 2017 3:48 pm IST


తమిళ స్టార్ హీరో విజయ్ చేసిన తాజా చిత్రం ‘మెర్సల్’ గత వారం విదుడాలి భారీ స్థాయి ఓపెనింగ్స్ సాధించి, రికార్డ్ వసూళ్ల దిశగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కలెక్షన్లతో పాటే ఈ సినిమా చుట్టూ కాంట్రవర్సీలు కూడా చేరుతున్నాయి. ఇప్పటికే అధికార ప్రభుత్వం సినిమానాలో జీఎస్టీ పద్దతిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని అనగా ఇతర పార్టీలు, సినీ పెద్దలు సినిమాకు సపోర్ట్ చేశారు. ఇలా ఈ వివాదం ఇంకా పూర్తిగా ముగియకముందే ఇంకో వివాదం తలెత్తింది.

అదేమిటంటే దేవాలయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పద్ధతులు, పథకాలు తప్పుగా ఉన్నాయని చెప్పే రీతిలో ఈ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని మధురైలో విజయ్ పై పిర్యాదులు చేయబడ్డాయట. అక్కడి పోలీసులు కూడా పిర్యాదుల్ని నమోదుచేసుకున్నారని వినికిడి. మరి ఈ వివాదం ఎంతవరకు పోతుందో చూడాలి. ఏది ఏమైనా ఈ తరహా ప్రచారం సినిమాకు మంచి పబ్లిసిటీని తెచ్చిపెడుతోంది.

 
Like us on Facebook