ఈ ఏడాది టిల్లు స్క్వేర్ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ కెరీర్ లో బిజీగా దూసుకు పోతున్నారు అనుపమ పరమేశ్వరన్. ఈ బ్యూటీ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ లాక్ డౌన్ నుండి మేకర్స్ నేడు ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.
లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి AR జీవా రచన, దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ ఫస్ట్ లుక్ లో అనుపమ మట్టిని చల్లినట్లు గా ఉంది. పోస్టర్ చాలా నాచురల్ గా ఆకట్టుకుంటుంది. అనుపమ మరోసారి డిఫెరెంట్ రోల్ లో కనిపించనున్నట్లు పోస్టర్ ను చూస్తే తెలుస్తుంది. అయితే ఈ చిత్రం పూర్తి ఎమోషన్స్ తో నిండి ఉంది అని మేకర్స్ వెల్లడించారు. ఎ.ఆర్. రఘునందన్ మరియు సిద్దార్థ్ విపిన్ లు ఈ చిత్రంకి సంగీతం అందిస్తుండగా, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.