‘రణబాలి’ నెక్స్ట్ సాంగ్ కి డేట్ ఫిక్స్.. పవర్ఫుల్ కోబలి రాబోతుంది!

‘రణబాలి’ నెక్స్ట్ సాంగ్ కి డేట్ ఫిక్స్.. పవర్ఫుల్ కోబలి రాబోతుంది!

Published on Oct 10, 2026 8:00 PM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తన భార్య రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు రాహుల్ తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ సినిమానే ‘రణబాలి’. మంచి హైప్ ఉన్న ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ కేవలం ఒకే ఒక్క చార్ట్ బస్టర్ సాంగ్ ని విడుదల చేశారు. అయితే రెండో సాంగ్ ని ఫైనల్ గా రేపు అక్టోబర్ 11న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

సీమ ప్రాంతపు నేపథ్యంలో సాగే ‘కోబలి’ అనే ఈ పాటని రేపు విడుదల చేస్తున్నట్టుగా పాన్ ఇండియా వెర్షన్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక దీనిపై విడుదల చేసిన పోస్టర్ లో కూడా విజయ్ పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఆల్రెడీ సంగీత దర్శకులు అజయ్ అతుల్ లు ఫస్ట్ సింగిల్ ని చార్ట్ బస్టర్ గా అందించారు. ఇక రెండో సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించగా ఈ అక్టోబర్ 16న పాన్ ఇండియా లెవెల్లో సినిమా రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు