ఈ దసరా కానుకగా టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు చిత్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూలాలని ప్రతిబింబిస్తూ వస్తున్న సినిమాలు రణబాలి, గరివిడి లక్ష్మి లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఒకటి రాయలసీమ నేపథ్యంలో వస్తుండగా మరో సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో వస్తుంది.
అయితే వీటిలో ఆల్రెడీ రణబాలి సినిమా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి తనయుడు అలాగే మంత్రి నారా లోకేష్ స్పందించడం వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా తర్వాత ‘గరివిడి లక్ష్మి’ మేకర్స్ కి లోకేష్ తనన బూస్టప్ అందించారు.
“సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్న గరివిడి లక్ష్మి సినిమా పాటలు, టీజర్ నాలో ఆసక్తి రేపాయి. ఎవరీ గరివిడి లక్ష్మి, ఏంటా కథ అని ఆరా తీశాను. ఊరు పేరునే ఇంటి పేరుగా, బుర్రకథనే జీవితంగా బతికి, కళని బతికించిన రెడ్డి విజయలక్ష్మి యథార్థ గాథ ఆధారంగా గరివిడి లక్ష్మి సినిమా తెరకెక్కుతోందని తెలిసింది. చదువుకోకపోయినా సాంప్రదాయ బుర్రకథ శైలికి ఉత్తరాంధ్ర జానపదాలు, పల్లెపదాలు జోడించి బుర్రకథ కళకే వన్నెతెచ్చిన గరివిడి లక్ష్మి సినిమా విడుదల కోసం ప్రేక్షకుల మాదిరిగానే నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన కళాకారులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.” అంటూ పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.
అయితే లోకేష్ నుంచి సడెన్ గా టాలీవుడ్ వైపు బ్యాక్ టు బ్యాక్ స్పందించడంపై మరింత ఆసక్తి ఇపుడు ఏర్పడింది. రానున్న రోజుల్లో కీలక పరిణామాలు ఏమన్నా తెలుగు సినిమా విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి చోటు చేసుకుంటాయా లేక ఇది సాధారణ స్పందనేనా అనేది చూడాలి.
సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్న గరివిడి లక్ష్మి సినిమా పాటలు, టీజర్ నాలో ఆసక్తి రేపాయి. ఎవరీ గరివిడి లక్ష్మి, ఏంటా కథ అని ఆరా తీశాను. ఊరు పేరునే ఇంటి పేరుగా, బుర్రకథనే జీవితంగా బతికి, కళని బతికించిన రెడ్డి విజయలక్ష్మి యథార్థ గాథ ఆధారంగా గరివిడి లక్ష్మి సినిమా తెరకెక్కుతోందని తెలిసింది. చదువుకోకపోయినా సాంప్రదాయ బుర్రకథ శైలికి ఉత్తరాంధ్ర జానపదాలు, పల్లెపదాలు జోడించి బుర్రకథ కళకే వన్నెతెచ్చిన గరివిడి లక్ష్మి సినిమా విడుదల కోసం ప్రేక్షకుల మాదిరిగానే నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన కళాకారులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
@anandhiactress @smayurk
https://t.co/4NMPO0sESM— Lokesh Nara (@naralokesh) October 10, 2026


