‘రొమాంటిక్’ హీరోయిన్ కి క్రేజీ ఆఫర్ ?

Published on Oct 18, 2021 9:00 am IST

టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త తరం హీరోయిన్ల రాక ఎక్కువైపోయింది. ‘కేతిక శర్మ’ అనే యంగ్ హీరోయిన్ తెలుగు చిన్న సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఫాలోయింగ్ తెచ్చుకున్న కేతిక శర్మకి తాజాగా మరో తెలుగు సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. హీరో రామ్ సినిమాలో ఆమెకు హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.

నిజానికి ‘కేతిక శర్మ’లో మంచి టాలెంట్ ఉన్నా.. ఆమెకు కాలం కలిసిరాలేదు. దీనికితోడు బ్యాడ్ టైమ్ నడిచింది. కేతిక శర్మకు పెద్ద సినిమా అవకాశాలు అంత తేలిగ్గా రాలేదు. ఇప్పుడిప్పుడే ఆమె హీరోయిన్ గా ఛాన్స్ లు వస్తున్నాయి. ఇక ఆమె నటించిన ‘రొమాంటిక్’ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఈ సినిమా ఎప్పుడో పూర్తి అయింది. అయితే కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

సంబంధిత సమాచారం :

More