టాలెంటెడ్ నటికి హీరోయిన్ గా క్రేజీ ఆఫర్లు !

Published on Oct 24, 2021 9:03 pm IST

టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ తెలుగుమ్మాయి అయినా తమిళంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. అయితే తెలుగులో కూడా సినిమాలు చేసినా ఆమెకు మెయిన్ హీరోయిన్ గా మాత్రం టాలీవుడ్ లో సరైన అవకాశాలు రాలేదు. సెకండ్ హీరోయిన్ గానో సైడ్ పాత్రలకో పరిమితం అవుతూ వచ్చింది. అయితే ‘రిపబ్లిక్’ లాంటి సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కనిపించినా.. అది కమర్షియల్ హీరోయిన్ పాత్ర కాదు.

అయితే ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో మెయిన్ హీరోయిన్ పాత్రలు రాకపోయినా తమిళ మేకర్స్ మాత్రం ఆమెను మెయిన్ హీరోయిన్ గా ఆదరిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ తాజాగా వరుస తమిళ సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా అవకాశలను అందుకుంటుంది. తమిళ స్టార్ హీరో సూర్య నిర్మిస్తున్న కొత్త చిత్రంలో ఐశ్వర్య రాజేష్ మెయిన్ హీరోయిన్ గా ఖరారు అయింది. వైవిధ్యమైన దర్శకుడు బాల తీస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ దే మెయిన్ పాత్ర. అలాగే తాజాగా హీరో ఆర్య సరసన కూడా ఐశ్వర్య రాజేష్ ఒక సినిమా చేస్తోందట.

సంబంధిత సమాచారం :

More