ఇస్మార్ట్ శంకర్ తో సుకుమార్ మూవీనా..?

Published on Apr 5, 2020 1:30 am IST

మొదటి చిత్రం ఆర్య తోనే దర్శకులలో తాను ప్రత్యేకం అని నిరూపించుకున్నారు డైరెక్టర్ సుకుమార్. ఓ ట్రెండ్ సెట్టింగ్ మూవీగా వచ్చిన ఆ చిత్రం సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం తరువాత అల్లు అర్జున్ హీరో రామ్ తో ఓ మూవీ చేశాడు. జగడం అనే టైటిల్ తో వచ్చిన ఆ చిత్రాన్ని సుకుమార్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. గూండాయిజం, గొడవలు నేపథ్యంలో వచ్చిన ఆ మూవీ కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేదు.

ఈ మూవీ వచ్చి దాదాపు 13ఏళ్ళు అవుతుంది. కాగా ఈ కాంబినేషన్ మళ్ళీ మూవీ రానుందంటూ ఓ వార్త ప్రచారం లోకి వచ్చింది. రామ్ తో మూవీ చేయాలని సుకుమార్ భావిస్తున్నాడట. ఇప్పటికే సుకుమార్, రామ్ కి స్టోరీ నేరేట్ చేశాడని టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్ తో మూవీ కంప్లీట్ అయిన వెంటనే సుకుమార్ రామ్ మూవీకి సంబందించిన వర్క్ స్టార్ట్ చేస్తాడని సమాచారం. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదుగా టాలీవుడ్ లో విపరీతంగా ప్రచారం అవుతుంది. ఇక రామ్ ప్రస్తుతం రెడ్ మూవీలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More