కస్టడీ : టీజర్ లో నాగ చైతన్య క్రేజీ లుక్ పై అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

Published on Mar 17, 2023 1:04 am IST


నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కస్టడీ. యక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో శరత్ కుమార్, అరవింద్ స్వామి, ప్రియమణి, ప్రేమి విశ్వనాధ్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి దీనిని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో కస్టడీ మూవీ మే 12న విడుదల కానుంది.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్ తో అందరి దృష్టిని ఆకర్షించిన కస్టడీ నుండి నేడు అఫీషియల్ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ యాక్షన్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ టీజర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ టీజర్ లో ఒకప్పటి నాగార్జున లుక్ లో నాగచైతన్య గడ్డంతో కొన్ని క్షణాల పాటు కనిపిస్తారు. అది చూసిన పలువురు అక్కినేని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీజర్ లోని ఆ క్రేజీ లుక్ ని పలువురు ఆడియన్స్, అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రస్తుతం మరింతగా అంచనాలు పెంచేసిన కస్టడీ మూవీ రిలీజ్ తరువాత తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :