‘కస్టడీ’ నా కెరీర్ లో మంచి సినిమా అవుతుంది – నాగ చైతన్య

Published on May 12, 2023 4:00 am IST

యువ నటుడు నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కస్టడీ. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా దీనిని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి గ్రాండ్ గా నిర్మించారు. కాగా ఈ బైలింగువల్ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా అన్ని కూడా అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. ఇక రేపు తెలుగు, తమిళ భాషల్లో కస్టడీ మూవీ రిలీజ్ కానుండడంతో నేడు ప్రత్యేకంగా మీడియాతో ముచ్చటించారు నాగ చైతన్య.

 

కస్టడీ అనేది సీరియస్‌ యాక్షన్‌ సినిమా కదా? మీకున్న ప్రజెంట్‌ మూడ్‌ ను షూటింగ్‌ లో ఎలా మ్యాచ్‌ చేసుకున్నారు? ఇందులో మీకనిపించిన ఛాలెంజ్‌ ఏమిటి?
ప్రతి సినిమాకు రెండు నెలలు వర్క్‌ షాప్‌ చేస్తాను. క్యారక్టర్‌ ఎలావుండాలి అనేవి కథలోని కొన్ని సీన్స్‌ ను 5డి కెమెరాతో షూట్‌ చేస్తాం. ఈ కథ పరంగా కొంతమంది పోలీసు కానిస్టేబుళ్లను పరిశీలించాను. కొంతమంది ని కలిశాను కూడా. ఇలాంటివి కొంతమంది దర్శకులు ఎంకరేజ్‌ చేస్తారు. అలా వెంకట్‌ ప్రభు నాకు ప్రీడమ్‌ ఇచ్చారు. పోలీసు కానిస్టేబుళ్లను కలిశాక. వారి కష్టాలు విన్నాక నాకే ఇన్స్పయిరింగ్ గా అనిపించింది. అందుకే వారి కథలు చెప్పాలనుకున్నా. ఈ క్యారెక్టర్ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది.

 

యాక్షన్‌ సినిమాలలో పోలీస్‌ పాత్రల్లో మీకు ఎవరు ఫేవరేట్‌?
ఘర్షణ ఆల్‌ టైం. ఇక ఇంటర్నేషనల్‌ పరంగా జేమ్స్‌ బాండ్‌ 007 సినిమాలు అంటే ఇష్టం.

 

వెంకట్‌ప్రభు గారి దర్శకత్వంలో సినిమా చేశాక ప్రేక్షకులు ఎలా రెస్పాండ్‌ అవుతారని అపిపిస్తుంది?
నేను సినిమా చూశా. చాలా నమ్మకంతో వున్నా. ఆడియన్స్‌ ఎలా స్వీకరిస్తారో వారి తీర్పే ఫైనల్‌. నేను చేసే ప్రతి సినిమా డిఫరెంట్‌ గా వుంటుంది. ఇలాంటి రోల్‌ నాకు కస్టడీలో వర్కవుట్‌ అయింది అనుకుంటా. ఈ సినిమా తర్వాత పూర్తి భిన్నమైన సినిమా చేయబోతున్నా. ఆడియన్స్ కి కస్టడీ ఆకట్టుకుంటుంది అనే నమ్మకం అయితే ఉంది.

 

యాక్షన్‌ పార్ట్‌ చేసేటప్పుడు ఎటువంటి కేర్‌ తీసుకున్నారు?
యాక్షన్‌ సీన్స్‌ చాలా నాచురల్‌ గా వుంటాయి. ఫైట్‌ మాస్టర్లతో రిహార్సల్స్‌ చేశాక షూట్‌ కు వెళ్ళాం. పైకి ఎగిరే సన్నివేశాలు, అండర్‌ వాటర్‌ వంటి సీన్స్‌ వారితో చర్చించాక చేసినవే. కస్టడీ ట్రైలర్‌, టీజర్‌ లో అది మీకు కనిపిస్తుంది. మనం ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రేక్షకులు ఇట్టే పట్టేస్తారు. అందుకే యాక్షన్‌ పార్ట్‌ చాలా కీలకం ఈ సినిమాలో. అందరం ఎంతో కష్టపడ్డాము.

 

మీరు తమిళ్‌ డబ్బింగ్‌ చెప్పారా?
నటుడిగా వాయిస్‌ ముఖ్యం. అందుకే తమిళంలో నేను డబ్బింగ్‌ చెప్పాను. మొదట్లో చిన్న చిన్న లోపాలున్నా బాగానే చెప్పగలిగాను.

 

మీరు ఏ పాత్ర చేస్తున్నారు?
నేను కానిస్టేబుల్‌గా నటించా. నా పాత్రపరంగా వెంకట్‌ప్రభుగారు చెప్పింది చెప్పినట్లు తీశారు. పూర్తి న్యాయం చేశాను. ఎంజాయ్‌ చేస్తూ చేసిన పాత్ర ఇది.

 

అరవింద్‌ స్వామి గారి నుంచి ఏం నేర్చుకున్నారు?
అరవింద్‌గారికి స్క్రిప్ట్‌ పేపర్‌ ఏది ఇస్తారో దాన్ని ఓన్‌ గా తన శైలితో ఇంప్రూవ్‌ మెంట్‌ చేసుకుంటారు. పేకప్‌ అయ్యాక కూడా ఆ పాత్ర గురించే ఆలోచిస్తారు. నైట్‌ మెసేజ్‌ కూడా ఫలానా సీన్‌ గురించి ఇలా వుండాలంటూ చెబుతారు. ఆయనతో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎప్పటికీ మరువలేను.

 

కస్టడీలో పోలీసుగా ఫ్యాన్స్‌ ఏవిధంగా రిసీవ్‌ చేసుకుంటారు?
నేను పర్టిక్యులర్‌ గా పలానా పాత్ర అనేది చేయను కథను బట్టి పాత్రను బేరీజు వేసుకుంటాను. లవ్‌ స్టోరీలు గతంలో చేశాను. కంటిన్యూ గా అవే చేస్తే నటుడిగా ఎదగలేను. చైతన్య ఎలాంటి కథలోని పాత్రనైనా బాగా చేస్తాడని అనిపించుకోవాలి.

 

నటి పరంగా కృతి శెట్టి లో మీరు గమనించింది ఏమిటి?
ఫ్యామిలీ ఎమోషన్స్‌ బాగా పండించింది. నటిగా తను చాలా మెచ్యూర్డ్‌. తమిళం బాగా నేర్చుకుంది.

 

నిర్మాతగారు మాట్లాడుతూ, నాగార్జునగారికి శివ ఎలాగో చైతన్యకు కస్టడీ అలాగ అన్నారు. మీరేమంటారు?
నిజానికి ఏ సినిమాకూ కస్టడీని కంపేర్‌ చేయవద్దు. నేను ఈ సినిమాపై చాలా కాన్‌ఫిడెంట్‌ గా వున్నాను.

 

అక్కినేని ఫ్యాన్స్‌ గొప్పగా ఫీలయేట్లు వుంటుందా?
నూరు శాతం వారికి పాజిటివ్‌గా వుంటుంది. అక్కినేని అభిమానులకు మంచి సినిమా ఇచ్చాననే నమ్మకం నాకుంది.

 

శరత్‌కుమార్‌, ప్రియమణి, అరవింద్‌ స్వామి ముగ్గురు ఉద్దండుల మధ్య నటించడం మీకెలా అనిపించింది?
ఒకరకంగా చెప్పాలంటే సినిమాలో ముగ్గురి మధ్య నలిగిపోతాను. అదే సినిమాకు హైలైట్‌. అందుకే లుక్‌ పరంగా డిఫరెంట్‌ గా కనిపిస్తాను. సైజ్‌ కూడా తగ్గాను. ఫిట్‌ కానిస్టేబుల్‌ ఎలా వుంటాడో అలా మార్చుకున్నా.

 

అక్కినేని కుటుంబ హీరోగా మీకు ఒత్తిడి ఏమైనా వుందా?
నేను చేసే ప్రతి సినిమా ఛాలెంజ్ గా తీసుకుంటాను. ప్రతిరోజూ కష్టపడి పని చేస్తుంటాను. తాతగారు, నాన్నగారికి ఫ్యాన్స్‌ ఎలా అయ్యారంటే వారికంటూ ఒక శైలితో ఆకట్టుకున్నారు. అలాగే నేను, అఖిల్‌ కూడా స్వంత స్టయిల్‌ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం.

 

అండర్‌ వాటర్‌ సీన్‌ ఎన్నిరోజులు చేశారు?
నాలుగు రోజులు రిహార్సల్స్‌ చేశాం. మొత్తం 15రోజుల్లో షూట్‌ చేశాం. ఎంతో కష్టమైనా ఇష్టంతో చేసాము.

 

ఇళయరాజాగారిని ఎంచుకోవడానికి కారణం?
ఈ సినిమా 1990 బ్యాక్‌ డ్రాప్‌ లో జరుగుతుంది. అందుకే ఆ కాలానికి తగిన విధంగా ఇళయరాజా గారి వింటేజ్‌ వుంటుంది. అందుకే అడిగారు. ఈ సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అల్టిమేట్‌. ఇళయరాజాగారు కొన్ని ట్రాక్స్‌ నోట్‌ ఇచ్చారు. దానిని యువన్‌ శంకరరాజా అద్భుతం గా చేశారు.

 

కస్టడీ2 వుంటుందా?
ప్రేక్షకులు హిట్‌ చేస్తే తప్పకుండా చేస్తాం. అందరూ పాన్‌ ఇండియావైపు వెళుతున్నారు? తెలుగు, తమిళ ఆడియన్స్‌ నా టార్గెట్‌.

ఆల్ ది బెస్ట్ థాంక్యూ

సంబంధిత సమాచారం :