మూడు భాషల్లో ‘దక్షిణ కాళీ’.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక

మూడు భాషల్లో ‘దక్షిణ కాళీ’.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక

Published on Jan 5, 2026 8:00 AM IST

Untitled 7

సుబ్బు, ప్రియాంక జంటగా నటించిన భక్తిరస చిత్రం ‘దక్షిణ కాళీ’. శ్రీనిధి క్రియేషన్స్ పతాకంపై సత్యవాణి మీసాల ఈ చిత్రాన్ని నిర్మిస్తూ కథను అందించారు. తోట కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటి అర్చన అమ్మవారి పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇటీవల ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ, అమ్మవారి మహిమలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. ఇప్పటికే సినిమాను వీక్షించిన డిస్ట్రిబ్యూటర్ల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని, నిర్మాత సత్యవాణి ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారని పేర్కొన్నారు. తాను అమ్మవారి భక్తురాలినని, దైవానుగ్రహం వల్లే సినిమా అద్భుతంగా వచ్చిందని నిర్మాత సత్యవాణి సంతోషం వ్యక్తం చేశారు.

హీరోయిన్ ప్రియాంక, హీరో సుబ్బు మాట్లాడుతూ… సినిమా నిర్మాణంలో నిర్మాత పడ్డ కష్టాన్ని, ఆమె అంకితభావం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సినిమా నిర్మాణం ఓ యజ్ఞం లాంటిదని, సత్యవాణి గారు దాన్ని విజయవంతంగా పూర్తి చేశారని సుబ్బు కొనియాడారు. ఇందులో విలన్‌గా అఫ్సర్ ఆజాద్ ఓ కీలక పాత్రలో మెప్పించనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమా ఉంటుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది.

తాజా వార్తలు