విడుదలైన ధనుష్ ‘అనేకుడు’ ఆడియో..
Published on Feb 10, 2015 9:21 pm IST

Anekudu
ధనుష్, అమైరా దస్తూర్ జంటగా నటించిన తమిళ సినిమా ‘అనేగన్’. తెలుగు ఈ సినిమాను ‘అనేకుడు’ పేరుతో అనువదిస్తున్నారు. ‘రంగం’ ఫేం కెవి ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నేడు హైదరాబాద్, సినీమాక్స్ థియేటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ధనుష్, అమైరా దస్తూర్, వివి వినాయక్, సి.అశ్వినిదత్, సి.కళ్యాణ్. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) తదితర ప్రముఖులు హాజరయ్యారు. వివి వినాయక్ ఆడియో సిడిని ఆవిష్కరించారు.

సినిమాను ఫిబ్రవరి 20న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని, పాటలు బాగున్నాయని ఈ కార్యక్రమానికి హాజరయిన అతిధులు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘రఘువరన్ బిటెక్’, ‘పందెం కోళ్ళు’ సినిమాలతో తెలుగులో సక్సెస్ కొట్టిన ధనుష్.. ‘అనేకుడు’తో హట్రిక్ అందుకోవాలని ఆకాంక్షించారు.

 
Like us on Facebook