అన్ని భాషల్లో “అవతార్ 2” స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్.?

Published on May 16, 2023 9:00 am IST

హాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ అద్భుత సృష్టి లలో తాను ప్రపంచ సినిమాకి పరిచయం చేసిన మరో అద్భుతం “అవతార్”. గత 2009 లో రిలీజ్ అయ్యిన మొదటి భాగం ఇప్పటికీ వరల్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలవగా మళ్ళీ దాదాపు దశాబ్ద కాలం తర్వాత 13 ఏళ్ళు వెయిటింగ్ అనంతరం వచ్చిన అవతార్ 2(అవతార్ ది వే ఆఫ్ వాటర్) కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది.

గత ఏడాదిలో రికార్డు గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం గత కొన్నాళ్ల కితమే రెంటల్ గా అందులోని ఒక్క ఇంగ్లీష్ లో మాత్రమే స్ట్రీమింగ్ కి రావడం జరిగింది. అయ్యితే వరల్డ్ వైడ్ గా సహా ఇండియా లో కూడా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఓన్లీ ఇంగ్లీష్ స్ట్రీమింగ్ డిజప్పాయింట్ చేసింది.

ఇక ఫైనల్ గా అయితే ఈ సినిమా అవైటెడ్ అన్ని భాషలు స్ట్రీమింగ్ కి డేట్ కన్ఫర్మ్ అయ్యినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాని అయితే డిస్నీ+ హాట్ స్టార్ వారు ఈ జూన్ 7 నుంచి అయితే స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :