‘కాటమరాయుడు’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్సైంది !
Published on Feb 2, 2017 7:00 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన దగ్గర్నుంచి అభిమానుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఆరంభమైంది. ఇక ఈ మధ్య రిలీజైన ఫస్ట్ లుక్స్, మోషన్ పోస్టర్లు ఆ క్రేజ్ ను ఇంకా తారాస్థాయికి తీసుకెళ్లాయి. దాంతో టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ జనవరి నెలలోనే రిలీజ్ కావాల్సిన ఆ టీజర్ అనుకోని కారణాల వలన వాయిదాపడుతూ వచ్చింది.

దీంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి లోనయ్యారు. వాళ్ళ నిరుత్సాహాన్ని పోగొట్టానికే అన్నట్టు కాసేపటి క్రితమే సినిమాని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ ‘నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్’ టీజర్ ఫిబ్రవరి 4న సాయంత్రం 4 గంటలకు రిలీజవుతుందని ప్రకటించేసింది. దీంతో అభిమానులు ఈ వార్తను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఇకపోతే కొద్దిసేపటి క్రితమే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చేయడానికి రెడీ అయ్యారనే వార్త కూడా వెలువడటంతో అభిమానులకు ఈరోజు పండగ వాతావరణం వచ్చినట్లైంది.

 
Like us on Facebook