చైతూ, సమంత నిశ్చితార్థ ముహూర్తం ఖరారు!

naga-chatanya-samantha

అక్కినేని హీరో నాగ చైతన్య, సౌతిండియన్ స్టార్ హీరోయిన్ సమంత ఇద్దరూ చాలాకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది పెళ్ళి చేసుకోనున్నట్లు ప్రకటించిన ఈ ప్రేమ జంట ఇప్పటికి తమ రిలేషన్‌షిప్‌లో ఒకరి ఇష్టాలను ఒకరు పంచుకుంటూ సరదాగా కాలం గడుపుతున్నారు. ఇక తాజాగా వీరిద్దరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన తేదీ ఫిక్స్ అయిపోయింది. జనవరి 29, 2017న ఈ జంట నిశ్చితార్థం జరగనుందని సమాచారం అందింది.

భారీ ఎత్తున నిర్వహించే ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులంతా విచ్చేయనున్నారట. ఇంకా వేదిక ఏదన్నది ఖరారు కావాల్సి ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ పెయిర్స్‌లో ఒకరుగా ఈ జంటకు పేరుంది. అలాంటి జంట పెళ్ళితో ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతూ ఉండడం అభిమానులకు తియ్యటి కబురుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి తమ తమ కెరీర్స్‌తో బిజీగా ఉన్న ఈ ఇద్దరూ, పెళ్ళి పీటలెక్కేది ఎప్పుడన్నది మాత్రం తెలియాలి.