అదిరిపోయే టీఆర్పీ రాబట్టిన కళ్యాణ్ రామ్ “బింబిసార”

అదిరిపోయే టీఆర్పీ రాబట్టిన కళ్యాణ్ రామ్ “బింబిసార”

Published on Jan 19, 2023 3:02 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం లో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ బింబిసార. కేథరిన్ థెరిస్సా, సంయుక్త మీనన్ లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హారి కృష్ణ కే నిర్మించారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా నిలిచింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రీసెంట్ గా బుల్లితెర పై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించింది.

అయితే ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సూపర్ రేటింగ్ వచ్చింది. 11.46 టీఆర్పీ రేటింగ్ తో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా లో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం అమిగోస్ చిత్రం తో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు