ఎన్టీఆర్ సినిమాలో ఓపెనింగ్ సీన్ ఏంటో తెలుసా ?

తేజ దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్న సినిమా ఎన్టీఆర్. స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు నుండి ప్రారంభంకానుంది. బుర్రా సాయి మాధవ్ ఈ సినిమాకు సంభాషణలు సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి సంభందించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్ర ఉండబోతోందని సమాచారం. సినిమా ఆరంభంలో ఇందిరా గాంధీ, పి.వి.నరసంహ రావు కారులో ప్రయాణిస్తుండగా మార్గ మద్యలో ఎన్టీఆర్ కృష్ణుడు, రాముడు వేషంలో ఉన్న పెద్ద కటౌట్ లు కనిపిస్తాయి. అవి చూసిన ఇందిరా గాంధీ ఎవరితను ? అని అడగ్గా.. పి.వి.నరసింహరాజు సమాధానం ఇస్తూ.. అతను ఎన్టీఆర్… అని చెప్పగానే సినిమా టైటిల్ ‘ఎన్టీఆర్’ అని పడుతుందట. వాస్తవంగా జరిగిన ఈ సంఘటనే సినిమాకు ఆరంభ సన్నివేశమట.