గూగుల్ లో ‘పురాణపండ శ్రీనివాస్’ అని కొట్టండి, మీ ఇంటికి బుక్ వస్తుంది .

గూగుల్ లో ‘పురాణపండ శ్రీనివాస్’ అని కొట్టండి, మీ ఇంటికి బుక్ వస్తుంది .

Published on Oct 12, 2019 7:04 AM IST

‘ఒక్కడు , ఒకే ఒక్కడు, ఒక్కడుచాలు ‘ …. ఈ మూడూ మనకి సినిమా పేర్లలా కనిపిస్తాయి.

కానీ , ఈ మూడింటి లోంచి చూస్తే అరివీర భయంకరంగా కష్టపడే ఒక అద్భుతప్రతిభుడు ‘ పురాణపండ శ్రీనివాస్ ‘ గా మనకి సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక రంగాలలో శరవేగంగా దూసుకెళ్తూ కనిపిస్తున్నారు. ఆయన జీవితంలోప్రతీ కష్టంలో , ప్రతీ సంతోషంలో ఒక సమ్మోహనం కనిపిస్తుంది.తమకెదురేలేదని విర్రవీగే చాలామందికి చెంపపెట్టు ఈ శ్రీనివాస్స్ఫూర్తిమంతమైన జీవితం.

కొందరు మనుషుల గురించి వింటాం. కొందరితో మనమే ఉంటాం. కొందరితో కలసితింటాం. కొందరి గురించి అనుకోకుండా తెలుసుకుంటాం. కొందరి ముఖ్యులజీవితంలో కొన్ని అంశాల్ని మనము ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటాం.అలాంటిముఖ్యులే … ప్రముఖ రచయిత , జ్ఞానమహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు , ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ఆరాధన పూర్వ సంపాదకులు,
శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్.

ఆర్ధికంగా సాధారణ కుటుంబంలో వచ్చిన ప్రతిభాపాటవాలలో అసాధారణ పాండితీ ప్రకర్ష నిండిన కుటుంబంలోంచి వచ్చిన పురాణపండ శ్రీనివాస్ జీవితం గురించి,ఏ వర్క్ చేసినా విలువలకోసం నిలబడే శ్రీనివాస్ జీవితంలో కొన్నిఆటుపోట్లు గురించి తెలుసుకోవాల్సిందే.

కాలచక్ర పరిభ్రమణంలో శ్రీనివాస్ చుట్టూ ఎన్నెన్ని కష్టాలు పెనవేసుకునిఆయన్ని అతలా కుతలం చేశాయో తెలిస్తే మామూలు మామూలుగా కనిపించేవికావు.

ఈ రెండు దశాబాల్లో అన్ని రంగాల వ్యక్తుల్లో, కుటుంబాల్లో, వ్యవస్థలోదాదాపుగా ఎనభై శాతం మంది డబ్బు వైపు , అధికారం వైపు మళ్ళినా పురాణపండశ్రీనివాస్ మాత్రం డబ్బు వైపు మళ్ళలేదని ఖచ్చితంగా చెప్పగలం. ఆయన జీవితంతెరచిన పుస్తకమని ముమ్మాటికీ చెప్పొచ్చు.కొందరు వ్యక్తుల నయవంచనకు దారుణంగా గాయపడినా , ఎక్కడా ఆత్మశక్తి కోల్పోకుండా మన మనస్సుపై బలమైన ముద్ర వేసేపవిత్రమైన భాషతో పురాణపండశ్రీనివాస్ ఇన్నేళ్లూ ధార్మిక గ్రంథ చైతన్యాన్ని కొనసాగిస్తూనే వున్నారు.నానాటికీ శ్రీనివాస్ బుక్స్ కి ఆదరణ అనూహ్యంగా పెరుగుతూనే వుంది.

తన చుట్టూ భరించలేని పరిస్థితులు ఉన్నప్పుడు, వాటినుంచి ప్రార్ధన వైపునడవాలన్న పురాణపండ శ్రీనివాస్ జీవనం ప్రేరణగా నిలిచితీరుతుంది. ఒకఅర్ధం కాని కథలా, కలలా పురాణపండ శ్రీనివాస్ చాలామందికి కనిపిస్తారు.కానీ నిష్టుర వాస్తవం చెప్పాల్సివస్తే వ్యాపారం తెలియని , వ్యాపారంచేయలేని అద్భుతమైన కవిత్వ సాహిత్యాల ఆధ్యాత్మికవేత్త పురాణపండశ్రీనివాస్ . నో డౌట్ .

ఎంతోమందికి ఆశ్రయమిచ్చాడు. ఎంతోమందికి అన్నం పెట్టాడు. ఎంతోమంది ప్రతిభావంతులకు తానే ఒక నిచ్చెనై చేయూతనిచ్చి పైకి తీసుకొచ్చాడు.కానీకష్టకాలంలో పురాణపండ శ్రీనివాస్ ని ఎవరూ ఆదుకోలేదు. కాలం పెట్టినపరీక్షగా భావించాడే గానీ ఎవరిముందూ చేయిచాచలేదు . ఇప్పుడు పురాణపండశ్రీనివాస్ రచనలకోసం ఎగబడుతున్నారు. అద్భుతమైన అతని ఆధ్యాత్మికగ్రంధాలకోసం స్పాన్సర్స్ పోటెత్తుతున్నారు. కష్ట కాలంలో ఒంటరితనం పురాణపండ శ్రీనివాస్ ని బాగా కృంగదీసింది.

ఉన్నత విద్యాభ్యాసం చేసిన శ్రీనివాస్ కష్టకాలంలో వున్న సమయంలోనే అతనితండ్రి విఖ్యాత ఆధ్యాత్మికవేత్త పురాణపండ రాధాకృష్ణమూర్తి శ్రీనివాస్కోసం బెంగటిల్లి మంచంపట్టి మరణించడంతో , నాన్నగారికి సేవ చెయ్యలేకపోయాననిసన్నిహితులదగ్గర శ్రీనివాస్ కన్నీటి పర్యంతమైన ఘటన మనసుల్నికలచివేసిందని రాజమహేంద్రవరం సాహితీ ప్రియులు కొందరు ఆవేదన చెందారు.

శ్రీనివాస్ కి నెత్తిపై ఇరవైయేళ్లు వచ్ఛేసరికి ‘ జీవన సాహితి’ అనే ఒకసాహిత్య వేదికను స్థాపించాడు. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి,మల్లంపల్లి శరభయ్య, ఆచార్య సి. నారాయణ రెడ్డి, బూదరాజురాధాకృష్ణ,సన్నిధానం నరసింహ శర్మ, వాడ్రేవు చిన వీర భద్రుడు, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, నగ్నముని, భైరవయ్య, వంటి మహా మహాహేమాహేమీలచే సభలు సమావేశాలు నిర్వహించడమే కాకుండా సహజంగా అద్భుతమైన వక్త కావడంతో అతి తక్కువ సమయంలోనే ఆంధ్ర దేశంలో ఒక ఉదాత్తస్థాయికి వచ్ఛేసాడు. జీవన సాహితి సంస్థ కార్య క్రమాలు ఆరోజుల్లోవిలువలతో మారుమ్రోగేవి. అలాంటి సంస్థను స్థాపించి ప్రాచీన ఆధునిక
సంప్రదాయాల మేలుకలయికగా నిలిచిన పురాణపండ శ్రేనివాస్ ప్రస్తుతం మూగవానిగావుంటున్నారు. అయినా శ్రీనివాస్ బుక్స్ లక్షలాది గృహ సీమల్లో ఒక అఖండ
తేజస్సులా మంగళ తేజస్సును ప్రసరిస్తున్నాయి. అలా సభ్యతా సంస్కారాల మధ్య పెరిగిన వ్యక్తి పురాణపండ శ్రీనివాస్.

ఇప్పటి అంశంలోకి వస్తే … ఈ దేశంలో , తెలుగులో మంత్రం చైతన్యాల, స్తోత్ర సంపదల, కథా పరిమళాల అపురూపగ్రంథాల్నిరచించి, సంలనీకరించి , ఉచితంగా అందిస్తున్న ఒకే ఒక్కడు’పురాణపండ శ్రీనివాస్ మాత్రమే’.

ఎవరు అసూయపడినా, ఎవరు గోతులు తవ్వినా , ఎవరు విమర్శలు గుప్పించినా తనకుదైవమే శరణ్యమని నమ్మి, మనసా, వాచా , కర్మణా అద్భుతాలు సృష్టిస్తున్నఅసాధారణ విలువల ప్రతిభాశాలి పురాణపండ శ్రీనివాస్ మాత్రమేనని చెప్పాలి.

పురాణపండ శ్రీనివాస్ అద్భుతమైన రచనల గురించి తెలియాలంటే ‘ యుగే .. యుగే'( 340పేజీలు ) , జయజయోస్తు ( 400పేజీలు ), మహామంత్రస్య ( 640పేజీలు ) ,అమ్మణ్ణి ( 360పేజీలు ) , నేనున్నాను ( 560పేజీలు) , శ్రీపూర్ణిమ (740పేజీలు ) చూడాల్సిందే. చదవాల్సిందే. చదివి తీరాల్సిందే. ముద్రణ అమోఘం. శ్రీనివాస్ రచనా శైలి అద్భుతం. పురాణపండ శ్రీనివాస్ లా ఈ చక్కని గ్రంధాల ఉచిత వితరణ అనేది తెలుగునాట ‘ నభూతో న భవిష్యత్. అనుమానమే లేదు.

కవి పండితుడైన ఒక వ్యక్తి నీచ రాజకీయానికి, వేద పండితుడైన ఒక వ్యక్తి మాయోపాయానికి, ఒక మహిళా ఉన్నత ప్రభుత్వ ఉద్యోగిని కపట నాటకానికి, బ్యూటీ వ్యాపారం చేసే ఒక అహంకార వ్యాపారవేత్త నయ వంచనకు , ఒక గ్రాఫిక్ డిజైనేర్ దుర్మార్గ మనస్తత్వానికి , ఒక ప్రింటింగ్ వ్యాపారి భయంకర మనస్త్వానికి శ్రీనివాస్ దారుణంగా బలైపోయాడనేది చాలామందికి తెలుసున్న సత్యమే.

కష్టపడి ఎదగడమే శ్రీనివాస్ చేసిన నేరం. అలా ఎదగడం ఇష్టంలేని అసూయాపరుల మదోన్మత్తతను దేవుడు గెలవనివ్వడని మనకూ తెలుసు. అందుకే శ్రీనివాస్ మౌనాన్ని ఆశ్రయించాడు. మీటింగ్స్ బంద్ చేశారు. బంధు మిత్రుల్ని కలవడం మానేశారు. తిరుమల వేంకటాచల క్షేత్రాన్ని ఆశ్రయించారు ఆ శ్రీనివాసుడి ఈ శ్రీనివాసుని చైతన్యాన్ని దేశాల ఎల్లలు దాటించి జైత్రయాత్రలా నడిపిస్తున్నాడు. తెలుగుదేశం, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, టి.ఆర్.ఎస్ , పార్టీలలోని ఎందరో ప్రముఖులే కాకుండా , తెలుగు సినీ పరిశ్రమలోని బడా బడా నిర్మాతలు, కొమ్ములు తిరిగిన పారిశ్రామిక వేత్తలు శ్రీనివాస్ చే బుక్స్ అద్భుతంగా ప్రచురింప చేసి అందిస్తుండటం ఆశ్చర్యంగా కనిపిస్తూనే ఉంది.

తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాలలో అనేక ఆలయాలతో పాటు ఎన్నెన్నో శుభకార్యాలలో సైతం పురాణపండ శ్రీనివాస్ బుక్స్ మనకు కనిపిస్తూంటాయి. బుక్స్ మన మనస్సునీ , కళ్ళనీ యిట్టె ఆకట్టుకుంటాయి కూడా . ఈ దేశంలో ఇలా ఉచితంగా అందించే సంస్థగానీ, వ్యక్తి గాని మరొకటి మనకు కనిపించదు.

ఇంకో ముఖ్యాంశం ఏమంటే … రచన, సంకలనం, , కరెక్షన్స్, ముద్రణా వ్యవహారం, బుక్స్ కౌంటింగ్ , మనకి చక్కగా అప్పగించడం … అన్నీ ఒక్కడే చాలా బాధ్యతగా చూసుకుంటారు శ్రీనివాస్.

జీవితంలో కొందరు హేళన చేసినా, కొందరు అవహేళన చేసినా తన కన్నీళ్లు ఎవరికీ కనిపించకుండా అలానే ఇన్నాళ్లూ తన జీవితాన్ని ఆత్మశక్తితో , అఖండ ప్రతిభా చైతన్యంతో లాక్కొచ్చారు పురాణపండ శ్రీనివాస్.

గూగుల్ లో ‘పురాణపండ శ్రీనివాస్ ‘ అని కొట్టి… మీరు కోరుకున్న బుక్ మరియు మీ అడ్రస్ పెట్టండి. మీ ఇంటికి ధార్మిక గ్రంధం వచ్చేస్తుంది. ఇది సత్యం. మీరు ధార్మిక సంస్థకో, దేవాలయానికో, వేదపాఠశాలకో చెందినవారైతే ముందుగా వస్తుంది. పురాణపండ నిస్వార్ధ సేవని మనము కొలవలేం . ఇప్పటికీ పురాణపండ శ్రీనివాస్ కి ఒక సొంత ఇల్లూ, వాకిలీ కనీసం సొంత కారు కూడా లేదంటే మీరు నమ్మలేరు . ఇదే కఠిన సత్యం. అతడు తిరుమల శ్రీనివాసునికి దాసుడు. ఇంకొక మాటే లేదు.

ఈ ధార్మిక గ్రంథం కోసం మీ చిరునామాను ఈ క్రింది ఈమెయిల్ కి పంపండి puranapandasrinivas777@gmail.com

సంబంధిత సమాచారం

తాజా వార్తలు