“ధమాకా” సెన్సేషన్..5 రోజుల్లో 50 కోట్లకి.!

Published on Dec 28, 2022 10:00 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ నటించిన సూపర్ హిట్ ఎంటర్టైనర్ చిత్రం “ధమాకా”. సాలిడ్ అంచనాలు మరియు ప్రమోషన్స్ మధ్య వచ్చిన ఈ చిత్రం అయితే బాక్సాఫీస్ దగ్గర మరోసారి మాస్ మహారాజ స్టామినా ని ప్రూవ్ చేసింది. ఇక ఈ చిత్రం అయితే మొదటి మూడు రోజులు సాలిడ్ నంబర్స్ వసూలు చేయగా నెక్స్ట్ అయితే వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం సాలిడ్ గా నిలబడి అయితే దూసుకెళ్తుంది.

ఇక ఇప్పుడు అయితే సెన్సేషనల్ మార్క్ 50 కోట్లకి జస్ట్ దగ్గరకి ఈ చిత్రం వచ్చేసింది. ఇక ఈ 5 రోజుల్లో అయితే ధమాకా చిత్రం మొత్తం 49 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి మాస్ మహారాజ్ ఖాతాలో మరో 50 కోట్ల గ్రాసింగ్ చిత్రంగా నిలవడానికి రెడీ అయ్యింది. ఇక ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించగా భీమ్స్ సంగీతం అందించాడు. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :