ధనుష్ “సార్” నుంచి తన రోల్ రివీల్ చేస్తున్న కొత్త పోస్టర్.!

Published on Jul 28, 2022 10:59 am IST

ఇండియన్ సినిమా నుంచి ఇప్పుడు గ్లోబల్ గా ఆల్రెడీ అడుగు పెట్టిన స్టార్ హీరో ధనుష్ రీసెంట్ గా భారీ యాక్షన్ చిత్రం “ది గ్రే మ్యాన్” లో కనిపించి మెప్పించాడు. ఇక దీనితో పాటుగా మన దగ్గర పలు పాన్ ఇండియా సినిమాలు తమిళ్ సినిమాలు డైరెక్ట్ తెలుగు సినిమాలు కూడా తాను ఓకే చేసి శరవేగంగా వాటిని కంప్లీట్ చేస్తున్నాడు.

ఇలా బిజీగా ఉన్న తాను చేస్తున్న చిత్రాల్లో మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తో చేస్తున్న డైరెక్ట్ సినిమానే “సార్”. తెలుగు సహా తమిళ్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ నిన్ననే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇపుడు తాజాగా ధనుష్ బర్త్ డే సందర్భంగా మరో పోస్టర్ ని రిలీజ్ చేశారు.

అయితే ఇది మాత్రం మరింత ఆసక్తిగా డీటెయిల్స్ తెలుపుతుంది అని చెప్పాలి. ధనుష్ తన స్టూడెంట్స్ ముందు చాలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు అలాగే బ్యాక్గ్రౌండ్ లో సరస్వతి దేవి పుత్రుడు అన్నట్టుగా పొందుపరచడం తన పాత్రపై మరింత ఆసక్తి రేపుతోంది. అంటే ఈ లెక్కన ధనుష్ రోల్ చాలా ఇంటెలిజెంట్ గా కనిపిస్తుంది అని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ పోస్టర్ మాత్రం మంచి ఆసక్తి రేపుతోంది.

సంబంధిత సమాచారం :