ఈ సంస్థకి “ధనుష్” సార్ శాటిలైట్ హక్కులు.!

ఈ సంస్థకి “ధనుష్” సార్ శాటిలైట్ హక్కులు.!

Published on Feb 17, 2023 3:00 PM IST

కోలీవుడ్ గ్లోబల్ హీరో ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “వాథి” తెలుగులో “సార్” పేరిట రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ప్రీమియర్స్ తోనే మంచి టాక్ ని అయితే తెచ్చుకుంది. మరి ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ రన్ దిశగా కొనసాగుతూ ఉండగా ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు రెండు భాషల్లో సొంతం చేసుకోగా.

ఇపుడు సినిమా టెలివిజన్ శాటిలైట్ హక్కులు ఎవరు సొంతం చేసుకున్నారో తెలుస్తుంది. మరి ఈ సినిమా హక్కులు అయితే ప్రముఖ సంస్థ సన్ నెట్వర్క్ వారు కొనుగోలు చేయగా తెలుగులో ఈ చిత్రం జెమినీ టీవిలో ప్రసారం కానుంది. దీనితో అయితే మరోసారి ధనుష్ సినిమాని వారు దక్కించుకున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు