ముగింపు దశలో మెగా హీరో సినిమా !
Published on Jul 17, 2017 4:11 pm IST


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న చిత్రం ‘జవాన్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రచయిత నుండి దర్శకుడిగా మారిన బివిఎస్ఎన్ రవి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకుంటోంది. చిత్రీకరణ కూడా జూలై నెలాఖరుకు పూర్తవుతుందని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ క్రేజ్ ఉంది.

ఈ సినిమాను సెప్టెంబర్ 1వ తేదీన విడుదలచేయనున్నారు. మెహ్రీన్ కౌర్ ప్రిజాద హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ధరమ్ తేజ్ దేశమా, కుటుంబమా అనే సంఘర్షణను ఎదుర్కునే ఒక భాద్యత గల యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇకపోతే ఎస్. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్నారు. ‘తిక్క, విన్నర్’ వంటి పరాజయాల తర్వాత చేస్తున్న ఈ చిత్రం తేజ్ కెరీర్ కి కీలకంగా మారింది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook