చైతూ, మారుతి సినిమాకు డిఫరెంట్ టైటిల్ !
Published on Oct 27, 2017 3:50 pm IST

నాగ చైతన్య, మారుతి కాంబినేషన్‌లో ఒక సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. అది పూర్తి చేసుకుని ఈ ఏడాది ఎండింగ్‌లో సినిమాను ప్రారంభించే ఆలోచనలో మారుతి ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి మూవీస్‌కి టైటిల్స్ విభిన్నంగా పెడతారనే పేరుంది. అలాగే చైతుతో తీయబోయే మూవీకి కూడా కాస్త వైవిధ్యంగా ‘శైలజ రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ ఎంచుకున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఈ సినిమాలో చైతు సరసన అను ఇమ్మాన్యుయేల్ చేయనున్నారని సమాచారం తాజాగా మారుతి దర్శకత్వం వహించిన ‘మహానుభావుడు’ విజయం సాదించింది. పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకొని చైతు చేస్తున్న సినిమా ఇదేకావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి నటీనటుల ఎంపిక జరుగుతుంది. త్వరలో ఆఫిషియల్ గా అనౌన్స్ చెయ్యనున్న ఈ సినిమాకు సంభందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook