నితిన్ సినిమాకు డిఫరెంట్ టైటిల్ !
Published on Dec 12, 2017 11:33 am IST

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా కృష్ణ చైతన్య దర్శకత్వం తెరకెక్కుతున్న సినిమా లో నితిన్, మేఘా ఆకాష్ హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ అందిస్తుండడం విశేషం. తాజాగా ఈ సినిమా షూటింగ్ అమెరికలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

ఈ మూవీకి ”గుర్తుందా శీతాకాలం” అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేసారంట చిత్ర యూనిట్. విభిన్నమైన ప్రేమకథతో వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో రావు రమేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కు నటరాజ్ సుబ్రమణ్యన్ సినిమాటోగ్రఫర్. నితిన్ ఈ సినిమాతో పాటు దర్శకుడు సతీష్ వేగ్నేష్ డైరెక్షన్లో రూపొందనున్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో నటించబోతున్నాడు.

 
Like us on Facebook