సెప్టెంబర్ 19న ‘దిక్కులు చూడకు రామయ్య’ ఆడియో.
Published on Sep 5, 2014 9:00 am IST

Dikkulu-Chudaku-Ramayya
ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా ఆడియోను సెప్టెంబర్ 19న విడుదల చేస్తున్నారు. ‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రమిది. అజయ్, నాగ సౌర్య హీరోలుగా నటిస్తున్నారు. సన హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు త్రికోఠి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఎంఎం కీరవాణి అద్బుతమైన సంగీతం అందించిన ఒక పాటను అంతే అద్బుతంగా తెరపై చిత్రీకరించేందుకు కోటి రూపాయల సెట్ వేసి అందరిని ఆశ్చర్యపరిచారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని సమాచారం. అక్టోబర్ 1న సినిమా విడుదల చేస్తున్నట్టు సాయి కొర్రపాటి ప్రకటించారు.

 
Like us on Facebook