‘గౌతమ్ నంద’ నైజాం హక్కుల్ని భారీ ధరకు కొన్న ప్రముఖ నిర్మాత !
Published on Jun 19, 2017 11:47 am IST


గోపిచంద్ చేస్తున్న ప్రస్తుత చిత్రాల్లో సంపత్ నంది డైరెక్టక్ చేస్తున్న ‘గౌతమ్ నంద’ కూడా ఒకటి. ఆఖరి దశ పనుల్లో ఉన్న ఈ చిత్రం యొక్క టీజర్ ఇటీవలే విడుదలై మంచి స్పందన కూడా తెచ్చుకుంది. దీంతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తారా స్థాయిలో జరిగింది. ముఖ్యంగా నైజాం హక్కులు అన్నింటికన్నా భారీ ధరకు అమ్ముడయ్యాయి.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ రైట్స్ ను సుమారు రూ. 6. 30 కోట్లు వెచ్చించి కొన్నారు. అలాగే ఇతర ముఖ్య ఏరియాల్లో సైతం ఈ సినిమా మంచి బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. జె. భగవాన్, జె. పుల్లారావులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హన్సిక, క్యాథరిన్ థ్రెసాలు హీరోయిన్లుగా నటించారు. దుబాయ్ వంటి ఖరీదైన్ లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా గోపిచంద్, సంపత్ నందిల కెరీర్లకు కీలకమైన చిత్రమని చెప్పొచ్చు.

 
Like us on Facebook