‘రాజా ది గ్రేట్’ తో ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తామంటున్న దిల్ రాజు !
Published on Oct 7, 2017 9:33 am IST


అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజా ది గ్రేట్ చిత్ర ట్రైలర్ నిన్ననే విడుదలైంది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. దీపావళికి చిత్రాలని విడుదల చేస్తే మంచి ఫలితాలు రావనే అభిప్రాయం టాలీవుడ్ లో ఉంది. ఈ సెంటిమెంట్ ని తాము బ్రేక్ చేస్తామని దిల్ రాజు తెలిపారు. సంక్రాంతి, దసరా లాగే దీపావళి కూడా టాలీవుడ్ కు ముఖ్యమైన సీజన్ అని తాము రాజా ది గ్రేట్ చిత్రం ద్వారా రుజువు చేస్తామని దిల్ రాజు తెలిపారు.

బాలీవుడ్, కోలీవుడ్ వంటి పరిశ్రమల్లో స్టార్ హీరోల చిత్రాలు భారీ అంచనాలతో తమ చిత్రాలని విడుదల చేస్తారు. కానీ టాలీవుడ్ లో మాత్రం దీపావళి కి సినిమాలు విడుదల చేయాలంటే నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి రాజా దిగ్రేట్ చిత్రం విజయం సాధిస్తుందని భావిస్తున్నట్లు దిల్ రాజు తెలిపారు. కాగా రాజా ది గ్రేట్ చిత్ర ట్రైలర్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

 
Like us on Facebook