గ్లోబల్ స్టార్ తో బుచ్చిబాబు సన…వైరల్ అవుతోన్న పిక్!

Published on May 24, 2023 5:00 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా వరుస చిత్రాలు చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు తో. ఈ చిత్రం పై రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది.

ఈ చిత్రం పై డైరెక్టర్ బుచ్చిబాబు ప్రస్తుతం వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఎగ్జైటింగ్ టైమ్స్ అంటూ సోషల్ మీడియాలో పిక్ ను షేర్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :