నాగ శౌర్యతో ఖచ్చితంగా సినిమా ఉంటుందన్న డైరెక్టర్

naga-shourya-and-nandini
‘కళ్యాణ్ వైభోగమే, ఒక మనసు, జ్యో అచ్యుతానంద’ వంటి విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాగ శౌర్యతో డైరెక్టర్ నందినీ రెడ్డి ఓ సినిమా చేస్తున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ కొన్నిరోజులుగా ఈ చిత్రం ఆగిపోయినట్టు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలపై డైరెక్టర్ నందినీ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ప్రస్తుతం ‘పెళ్లి చూపులు’ ఫేమ్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నానని, ఆ పనులు పూర్తవగానే శౌర్యతో సినిమా ఉంటుందని తెలిపారు.

అలాగే తాజాగా శౌర్య చేసిన ‘జ్యో అచ్యుతానంద’ చిత్రం కూడా మల్టీ స్టారర్ కావడం, తాము అనుకున్నది కూడా మల్టీ స్టారర్ కావడం వలన మళ్ళీ మల్టీ స్టారర్ చేయకూడదని అనుకున్నామని, అందుకే ఆలస్యమైందని అన్నారు. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు పూర్తవగానే నాగ శౌర్యతో సినిమా మొదలుపెడతానని కూడా తెలిపారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘కళ్యాణ్ వైభోగమే’ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.