మరో బయోపిక్ కోసం వరంగల్ బాట పట్టిన ఆర్జీవీ..!

Published on Sep 24, 2021 2:22 am IST


వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా కోసం వరంగల్ జిల్లాలో సీక్రెట్‌గా పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలువురి బయోపిక్‌ల పేరుతో సంచలనం సృష్టించిన రాంగోపాల్ వర్మ మరో బయోపిక్ కోసం రెడీ అయినట్టు తెలుస్తుంది. వరంగల్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ-మురళిల బయోపిక్‌ను వర్మ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.

ఈ క్రమంలోనే వర్మ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారని, వరంగల్‌లోని ఎల్బీ కళాశాలలో అధ్యాపకులను, సిబ్బందిని కలిసి కొండా దంపతుల విద్యాభ్యాసం, ప్రేమకథ వివరాలను వర్మ సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సడెన్‌గా వర్మ కొండా దంపతులపై ఎందుకు ఫోకస్ పెట్టాడన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ బయోపిక్ ఎలాంటి వివాదాలకు తెరతీస్తుందో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :