“దసరా” ట్రైలర్ బ్లాస్ట్ అవుద్ది అంటున్న డైరెక్టర్ శ్రీకాంత్

Published on Mar 14, 2023 12:00 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈరోజు సాయంత్రం 4:59 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా ట్రైలర్ కి సంబంధించిన ఆసక్తికర పోస్ట్ ను షేర్ చేశారు హీరో నాని.

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ను ట్రైలర్ మిక్స్ ఎలా వచ్చింది అని హీరో నాని అడగగా, బ్లాస్ట్ అవుద్ధి అన్న ఈరోజు అంటూ తెలిపిన విషయాన్ని వెల్లడించారు. నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు తో పాటుగా, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :