స్టార్ డైరెక్టర్ నిర్మాణంలో యంగ్ హీరో !

Published on Dec 9, 2018 1:35 am IST

ఛలో సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్న నాగశౌర్యకు ‘అమ్మమ్మగారిల్లు’ మరియు ‘@నర్తనశాల’ చిత్రాలు బ్రేక్ వేశాయి. సక్సెస్ ఫుల్ హీరోగా కంటిన్యూ అవుదామనుకున్న శౌర్య ఆశలు మీద నీళ్లు చల్లాయి ఆ రెండు చిత్రాలు. కానీ ఇప్పుడు నాగశౌర్య మళ్లీ ఓ మంచి ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుకుమార్ నిర్మాణంలో ఈ హీరో ఓ సినిమా చేయబోతున్నాడు.

కాగా సుకుమార్ తన అసిస్టెంట్ ని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ.. తానే రాసిన ఒక కథతో నాగశౌర్య హీరోగా ఓ సినిమాని నిర్మించబోతున్నాడు.

అలాగే నాగ శౌర్య ప్రస్తుతం సమంతా లీడ్ రోల్ లో వస్తున్న ఒక సినిమాలో కూడా ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. మొత్తానికి నాగశౌర్య తన తర్వాత చిత్రాలకి సంబంధించి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

సంబంధిత సమాచారం :