అందరికీ నచ్చే సినిమా.. మిస్ లీలావతి!

అందరికీ నచ్చే సినిమా.. మిస్ లీలావతి!

Published on Apr 3, 2015 8:22 AM IST

Miss_Leelavathi
‘గంగ పుత్రులు’, ‘సొంత ఊరు’ వంటి చిత్రాల ద్వారా విమర్శకుల ప్రశంసలనూ, ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’, ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’ వంటి చిత్రాల ద్వారా బాక్సాఫీస్ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు పీ. సునీల్ కుమార్ రెడ్డి తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘మిస్ లీలావతి’. కార్తీక్, లీలావతి, మహేష్‌లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని నేడు (ఏప్రిల్ 3) విడుదల కానుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. హుదూద్ నేపథ్యంలో తెరకెక్కిన ఓ సోషల్ మెసేజ్ ఉన్న సినిమా ‘మిస్ లీలావతి’ అని తెలిపారు. అందరికీ నచ్చేలా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని దర్శక, నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమావేశంలో హీరో కార్తీక్, హీరోయిన్ లీలావతి, సినిమాటోగ్రాఫర్ శివరామ్, నిర్మాత రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు