సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సీక్వెల్ సినిమా జైలర్ 2 ఇప్పుడు విడుదలకి దగ్గరలో ఉంటే ఈ సినిమా తర్వాత తను శరవేగంగా చేస్తున్న సినిమానే ‘ధర్మన్’. దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ రాశిఖన్నా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
కానీ రాశిఖన్నా చేసిన ఓ పోస్ట్ తో సినిమాలో రామ్ కూడా ఉన్నాడు అని లీక్ అయ్యింది. ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మరో క్రేజీ లీక్ ఈ సినిమా విషయంలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో రాశిఖన్నా తో పాటు మరో బ్యూటీ శ్రీలీల కూడా నటిస్తున్నట్లుగా కన్ఫర్మ్ అయ్యింది. ఆమెపై నేరుగా సెట్స్ నుంచి బయటకి వచ్చిన వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది.
అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ ఇంట్రెస్టింగ్ గా ఈ ఏడాది వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ సినిమాలో నటించే ఛాన్స్ ని కొట్టేశారు. మరి ఈ సినిమాలో వీరి పెర్ఫామెన్స్ లు ఎలా ఉంటాయో చూడాలి.


