‘జైలర్ 2’లో కూడా ఇలాంటి బ్లాక్ ఉంటుందా!?

‘జైలర్ 2’లో కూడా ఇలాంటి బ్లాక్ ఉంటుందా!?

Published on Sep 30, 2026 8:00 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ సినిమానే జైలర్ 2. దీనికి ముందు పార్ట్ భారీ హిట్ అవ్వడంతో పార్ట్ 2 పట్ల మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా విడుదల దగ్గరకి వస్తున్న నేపథ్యంలో ఓవర్సీస్ బుకింగ్స్ కూడా ఈ సినిమాకి మొదలయ్యాయి.

ఇలా సాలిడ్ హైప్ ని బిల్డ్ చేసుకున్న ఈ సినిమాలో అనేక సర్ప్రైజ్ లని ఆడియెన్స్ ఆశిస్తున్నారు. అయితే రజినీకాంత్ అభిమానులు కూడా తలైవర్ విషయంలో పార్ట్ 1 లో లానే ఇందులో కూడా సాలిడ్ ఎపిసోడ్స్ ఆశిస్తున్నారు. అయితే పార్ట్ 1 లో హైలైట్ అయ్యిన అంశాల్లో రజినీని డీ ఏజింగ్ గా చూపించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఒకటి.

అయితే అలాంటి బ్లాక్ మళ్లీ పార్ట్ 2 లో ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది. మరోసారి రజినీకాంత్ వింటేజ్ ట్రీట్ ఇస్తే మాత్రం మళ్లీ అది ఫ్యాన్స్ కి ఓ మరపురాని అనుభూతి పంచడం గ్యారెంటీ. సో ఈసారి నెల్సన్ ఎలా ప్లాన్ చేసాడు అనేది ఈ అక్టోబర్ 15తో క్లారిటీ వస్తుంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సన్ పిక్చర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు