‘జైలర్ 2’ స్పెషల్ సాంగ్ కోసం పాపులర్ బ్యూటీ.. రిలీజ్ టైం ఫిక్స్!

‘జైలర్ 2’ స్పెషల్ సాంగ్ కోసం పాపులర్ బ్యూటీ.. రిలీజ్ టైం ఫిక్స్!

Published on Sep 30, 2026 12:02 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ 2 నుంచి మేకర్స్ అప్డేట్స్ ఇపుడు రోజుకొకటి వరదలా వదులుతూ వస్తున్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో అనేకమంది స్టార్ నటీనటులు ఉండగా ఇప్పుడు సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం పాపులర్ బ్యూటీ ప్రెజెన్స్ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

బాలీవుడ్ పాపులర్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసినట్టు మేకర్స్ ఇప్పుడు ఆమెపై ఓ పోస్టర్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఇక ఈమెపై చేసిన ఆ పాటనే ఇప్పుడు నాలుగో సాంగ్ గా ఈరోజు సాయంత్రం 6 గంటలకి విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మరి గతంలో కావాలి సాంగ్ తో రచ్చ లేపిన తమన్నా ని మించి నోరా సర్ప్రైజ్ చేస్తుందో లేదో చూడాలి.

అలాగే అనిరుద్ కూడా ఈసారి ఐటమ్ సాంగ్ కి ఎలాంటి బీట్స్ ఇచ్చాడో తెలియాలి అంటే ఈ సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మాణం వహించగా ఈ అక్టోబర్ 15న సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది.

తాజా వార్తలు