‘వారణాసి’కి తెలుగు స్టేట్స్ లో రికార్డ్ బిజినెస్?

‘వారణాసి’కి తెలుగు స్టేట్స్ లో రికార్డ్ బిజినెస్?

Published on Sep 30, 2026 10:13 AM IST

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ వారణాసి కోసం అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ప్లాన్ చేస్తున్న ఈ ఎపిక్ ప్రాజెక్ట్ ఇప్పుడు అంతిమ దశకు వచ్చేసింది. అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయి అనే దానికి రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న బిజినెస్ లెక్కలు తెలుపుతున్నాయి.

సుమారు 270 కోట్లకి పైగానే ఈ సినిమాకి బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది మాత్రం టోటల్ తెలుగు సినిమాలోనే అత్యధిక నెంబర్ అని చెప్పాలి. గతంలో పుష్ప 2, RRR వంటి సినిమాలు 200 కోట్లకి పైగా బిజినెస్ జరిపాయి. ఇప్పుడు వాటికి మించిన బిజినెస్ వారణాసి చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఈ చర్చలు హోల్డ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. దసరా తర్వాత వీటిపై ఓ క్లారిటీ రావచ్చట. సో మొత్తానికి వారణాసి ఒక కొత్త చరిత్రకు నాంది పలకబోతుంది అని చెప్పవచ్చు.

తాజా వార్తలు